శారదాపీఠాధిపతికి సాదర స్వాగతం
ABN , First Publish Date - 2020-09-14T09:08:29+05:30 IST
రుషికేశ్‌లో చాతుర్మాస దీక్ష ముగించుకుని ఆదివారం చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్న ..
రుషికేశ్‌లో చాతుర్మాస దీక్ష ముగించుకుని విశాఖ చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి
పెందుర్తి(విశాఖపట్నం), సెప్టెంబరు 13: రుషికేశ్‌లో చాతుర్మాస దీక్ష ముగించుకుని ఆదివారం చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతిని పీఠం శ్రీకార్యం, భక్తులు ఘనంగా స్వాగతించారు. రుత్వికులు వేద మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర పీఠంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా పీఠాధిపతిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, బూడి ముత్యాల నాయుడు, వైసీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, ముమ్మన దేవుడు దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.