-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » We must work collectively to strengthen the party
-
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-12-28T04:37:35+05:30 IST
కష్టకాలంలో కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు.

టీడీపీ నియోజకవర్గ నూతన ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు
రోలుగుంట, డిసెంబరు 27: కష్టకాలంలో కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. ఆదివారం రోలుగుంటలో మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్ధి సుర్ల రామకృష్ణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్ధంగా నిర్వహిస్తానన్నారు. అనంతరం మండల టీడీపీ శ్రేణులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో సుర్ల రామకృష్ణ, సామిరెడ్డి ముసలయ్యనాయుడు, వుండా రమణబాబు, రొంగలిరమణ, లగుడు సత్తిబాబు, సిరికోటి సత్యనారాయణ, కోలిపల్లి ఈశ్వరరావు, బంటు చిరంజీవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో నూతనోత్సాహం
చోడవరం: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన బత్తుల తాతయ్యబాబును నియమించడంతో నియోజకవర్గ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఓటమితో డీలాపడిన శ్రేణులు, ఇప్పటివరకు స్తబ్దుగా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం చాలామంది మొక్కుబడిగా పాల్గొంటుండడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సైతం కొవిడ్ తరువాత పెద్దగా బయటకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తాతయ్యబాబుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కదలిక వచ్చింది. ఇతనికి పార్టీలో అందరినీ కలుపుకొని పోగలిగే చొరవ ఉందని, దీనికితోడు మాజీ ఎమ్మెల్యే రాజుతో పాటు, మరో నాయకుడు గూనూరు మల్లునాయుడుతో మంచి సంబంధాలు ఉండడం పార్టీకి కలిసివచ్చే అంశమని భావిస్తున్నారు. తాతయ్యబాబు సారఽథ్యంలో నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు.