-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » We excelled with the encouragement of the seniors
-
సీనియర్ల ప్రోత్సాహంతోనే రాణించాం
ABN , First Publish Date - 2020-12-11T04:41:15+05:30 IST
సీనియర్ క్రికెటర్లు, కోచ్‌లు, ఏసీఏ సభ్యుల ప్రోత్సాహంతోనే తామంతా రాణించగలిగామని రంజీ క్రికెట్ ఆటగాళ్లు పి.విజయ్‌కుమార్, ఏసీ ప్రదీప్, ఎం.సురేష్ అన్నారు.

రంజీ క్రికెట్ మాజీ ఆటగాడు విజయ్‌కుమార్
కొమ్మాది, డిసెంబరు 10: సీనియర్ క్రికెటర్లు, కోచ్‌లు, ఏసీఏ సభ్యుల ప్రోత్సాహంతోనే తామంతా రాణించగలిగామని రంజీ క్రికెట్ ఆటగాళ్లు పి.విజయ్‌కుమార్, ఏసీ ప్రదీప్, ఎం.సురేష్ అన్నారు. పీఎం పాలెం ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆవరణలో గురువారం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రంజీల్లో రాణించి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లను సన్మానించారు. అనంతరం విజయ్‌కుమార్ మాట్లాడుతూ రంజీల్లో ఉత్తమంగా రాణించినప్పటికీ, భారత జట్టులో స్థానం సంపాదించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని నటరాజన్ లా అవకాశాలు దక్కి ఉంటే మరింత మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకునేవారమన్నారు. కొత్తగా వస్తున్న ఆటగాళ్లపై క్రికెట్ పెద్దలు దృష్టి సారిస్తే జాతీయ జట్టులో మెరుగైన క్రికెటర్లకు అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌కు నిర్వాహకులు రూ.5లక్షల చెక్కును అందజేశారు. అనంతరం స్టేడియం ఆవరణలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.