-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » We are giving home places to all those who are eligible
-
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం
ABN , First Publish Date - 2020-12-30T06:08:38+05:30 IST
రాజకీయాలు, కులాలు, మతాలకు అతీయతంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
కోటవురట్ల్ల, డిసెంబరు 28: రాజకీయాలు, కులాలు, మతాలకు అతీయతంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. మంగళవారం లింగాపురం, తంగేడు, కైలాసపట్నం, కోటవురట్ల, టి.జగ్గంపేట గ్రామాలకు చెందిన 529 మందికి మండల కేంద్రంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల నెరవేర్చుతున్న ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి సాగి సీతబాబు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విశేశ్వరరావు, తహసీల్దార్ రామారావు, ఎంపీడీవో సువర్ణరాజు, జడ్‌పీటీసీ మాజీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉపమాక ఆలయంలో ప్రమాణం చేస్తే.... అనిత సవాల్ స్వీకరిస్తా
వైసీపీ నాయకులతో కలిసి తాను అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే అనిత, ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తే ఆమె సవాల్‌ను స్వీకరిస్తానని ఎమ్మెల్యే బాబూరావు అన్నారు. విజిటింగ్ ప్రొఫెసర్‌లా వారానికోసారి నియోజకవర్గానికి వస్తూ, ప్రజలను మభ్యపెట్టే విఽధంగా మాట్లాడడం తగదన్నారు.