ప్రాంతీయ ప్రజారోగ్యశాలకు నీటి నమూనాలు

ABN , First Publish Date - 2020-12-11T05:44:45+05:30 IST

ఏలూరు ఘటన నేపథ్యంలో తాము వినియోగి స్తున్న నీరు ఎంతవరకూ సురక్షితం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలైంది. దీంతో కొంతమంది తాము రోజువారీ వినియో గించే నీటి నమూనాలను పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రాంతీయ ప్రజారోగ్యశాలకు నీటి నమూనాలు
ప్రజారోగ్యశాలకు వచ్చిన నీటి నమూనాలు

విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

ఏలూరు ఘటన నేపథ్యంలో  తాము వినియోగి స్తున్న నీరు ఎంతవరకూ సురక్షితం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలైంది. దీంతో కొంతమంది తాము రోజువారీ వినియో గించే నీటి నమూనాలను పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక పెదవాల్తేరు ప్రాంతంలో గల ప్రాంతీయ ప్రజారోగ్యశా లకు గత రెండు రోజుల్లో నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి నీటి నమూనాలు పరీక్షలకు వచ్చి నట్టు సిబ్బంది చెబుతున్నారు. బుధవారం రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదు నీటి నమూ నాలు ప్రయోగ శాలకు వచ్చాయి. అయితే ఏలూరులో పరిస్థితులకు కారణమైన అంశాలను నిర్ధారించేంత సాంకే తిక పరిజ్ఞానం ఇక్కడ అందుబాటులో లేదని, రెగ్యులర్‌గా చేసే పరీక్షలనే చేస్తామని ఇక్కడి అధికా రులు చెబుతు న్నారు. ఇదిలావుండగా ప్రాంతీయ ప్రజారోగ్యశాలలో నీటి నమూనాలను పరీక్షించే సీనియర్‌ అనలిస్ట్‌ శివరామకృష్ణను డెప్యూటేషన్‌పై అధికారులు ఏలూరుకు పంపించారు.

Updated Date - 2020-12-11T05:44:45+05:30 IST