నీటి సమస్యపై మహిళల నిరసన

ABN , First Publish Date - 2020-11-07T05:40:17+05:30 IST

రెండు రోజులుగా కృష్ణాదేవిపేటలోని కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా కాకపోవడంతో గ్రామంలోని పలువురు మహిళలు శుక్ర వారం ఉదయం ఆందోళనకు దిగారు.

నీటి సమస్యపై మహిళల నిరసన
ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు

   కృష్ణాదేవిపేట, నవంబరు 6 : రెండు రోజులుగా కృష్ణాదేవిపేటలోని కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా కాకపోవడంతో గ్రామంలోని పలువురు మహిళలు శుక్ర వారం ఉదయం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మెయిన్‌ రోడ్డులో నినాదాలు చేశారు. పంచాయతీలోని పలు విభాగాల సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో వారు గురువారం నుంచి విధులను బహిష్కరించిన నేపథ్యంలో ఈ సమస్య ఏర్పడింది. దీనిపై వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి సాయంత్రానికి తాగునీరు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేయడంతో అంతా శాంతించారు. 

Updated Date - 2020-11-07T05:40:17+05:30 IST