సముద్రం లోపల వ్యర్థాల తొలగింపు

ABN , First Publish Date - 2020-12-26T04:46:11+05:30 IST

క్రిస్మస్‌ సందర్భంగా రుషికొండ బీచ్‌లో లివిన్‌ అడ్వంచర్స్‌, త్రీఆర్‌ జీరో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సముద్రం లోపల వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.

సముద్రం లోపల వ్యర్థాల తొలగింపు
సముద్రం అడుగున వ్యర్థాలు తొలగించిన స్కూబాడ్రైవర్స్‌

సాగర్‌నగర్‌, డిసెంబరు 25: క్రిస్మస్‌ సందర్భంగా రుషికొండ బీచ్‌లో లివిన్‌ అడ్వంచర్స్‌, త్రీఆర్‌ జీరో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సముద్రం లోపల వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. స్కూబా డ్రైవర్లు శాంతాక్లాజ్‌ వేషధారణలో సముద్రజలాల్లోకి దూకి అడుగున పేరుకు పోయిన ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాలను తొలగించారు కార్యక్రమంలో బాలాజీ, బలరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-26T04:46:11+05:30 IST