కోత షురూ...

ABN , First Publish Date - 2020-04-07T11:39:13+05:30 IST

ప్రభుత్వం ప్రకటించినట్టే ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. సోమవారం పలువురు అకౌంట్లలో వేతనాలు జమ

కోత షురూ...

ఉద్యోగుల అకౌంట్లకు వేతనాలు

ముందుగా ప్రకటించినట్టే  పలువురికి 50 శాతం,

నాల్గో తరగతి సిబ్బందికి 10 శాతం కటింగ్‌


భీమునిపట్నం (రూరల్‌), ఏప్రిల్‌ 6: ప్రభుత్వం ప్రకటించినట్టే ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. సోమవారం పలువురు అకౌంట్లలో వేతనాలు జమ అయ్యాయి. అయితే అత్యధికులకు యాభై శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 90 శాతం వేతనాలు పడ్డాయి. దీంతో సాధారణ ఉద్యోగులకు యాభై శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు పది శాతం కోత విధించినట్టు భావిస్తున్నారు.


కొత్త ఉపాధ్యాయులను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించిన ప్రభుత్వం వారి వేతనాల్లో పది శాతం కోత విధించింది. కాగా, సాధారణ పింఛన్‌ దారులు, ఫ్యామిలీ పింఛన్‌దారుల అకౌంట్లలో పింఛన్‌ మొత్తం ఇంకా జమ కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో జమ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 


Read more