పాడి సంపద మరింత వృద్ధి చేయాలి’

ABN , First Publish Date - 2020-10-31T10:41:18+05:30 IST

పాడి సంపద వృద్ధికి రైతులు మరింత కృషి చేయాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ జి.రామకృష్ణ అన్నారు.

పాడి సంపద మరింత వృద్ధి చేయాలి’

ఎలమంచిలి, అక్టోబరు 30 : పాడి సంపద వృద్ధికి రైతులు మరింత కృషి చేయాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ జి.రామకృష్ణ అన్నారు.  పట్టణంలోని పశు వైద్యశాలలో శుక్రవారం ఏర్పాటైన మెగా పశువైద్య శిబిరాన్ని వైసీపీ నేతలు బోదెపు గోవింద్‌, బొద్దపు యర్రయ్యదొరలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పాడి పశువుల పెంపకంలో వెలకువలను వివరించారు. అనంతరం పెద్ద సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు జరిపి, వివిధ ఫార్మా కంపెనీలు సమకూర్చిన ముందులను  అందజేశారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.కరుణాకరరావు, డాక్టర్‌ సుధాకర్‌, వైసీపీ నాయకులు రంగసాయి, దూది నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T10:41:18+05:30 IST