లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15 లక్షలు చోరీ

ABN , First Publish Date - 2020-10-31T10:34:58+05:30 IST

రామాటాకీస్‌ ఏరియాలోని లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15లక్షల నగదు చోరీకి గురైంది. షోరూమ్‌ మేనేజర్‌ కిశోర్‌ ఫిర్యాదు మేరకు మూడోపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15 లక్షలు చోరీ

మద్దిలపాలెం, అక్టోబరు 30: రామాటాకీస్‌ ఏరియాలోని లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15లక్షల నగదు చోరీకి గురైంది. షోరూమ్‌ మేనేజర్‌ కిశోర్‌ ఫిర్యాదు మేరకు మూడోపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు ఈనెల 20న షోరూమ్‌లో అమ్మకాలు సాగించిన వచ్చిన నగదు రూ.15 లక్షలను బీరవాలో భద్రపరిచారు. మరుసటి రోజు ఉదయం షోరూమ్‌ తెరిచి నగదు బ్యాంక్‌కు తీసుకెళ్లాడానికి చూడగా కనిపించలేదు. షోరూమ్‌లో దొంగలు పడే సూచనలేవీ లేకపోవడంతో ఉద్యోగులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావించి ఆరా తీశారు. చోరీ చేసింది ఎవరో తేల్చలేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి, షోరూమ్‌ను సందర్శించారు. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎటువంటి ఫుటేజ్‌ లభ్యం కాలేదు.  

Read more