పోర్టులో విజిలెన్స్‌ వారోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-28T09:22:27+05:30 IST

విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

పోర్టులో విజిలెన్స్‌ వారోత్సవాలు ప్రారంభం

సిరిపురం, అక్టోబరు 27 : విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబరు రెండు వరకు ఈ వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాలలో భాగంగా విజిలెన్స్‌ అధికారులు విశాఖ వాసులలో అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కొవిడ్‌ కారణంగా కార్యక్రమాలను ఆన్‌లైన్‌ విధానం ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఉద్యోగులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నారు. పోర్టులో జరిగిన విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి జె.ప్రదీప్‌కుమార్‌  అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు.


ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్‌ రామ్మోహనరావు, సెక్రటరీ వేణుగోపాల్‌, విభాగాధిపతులు పాల్గొన్నారు. అనంతరం హెచ్‌బీ కాలనీలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌, ఆర్‌డీసీఐ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు. డీసీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ త్రిపాఠి పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐజీ రంగారావు హాజరయ్యారు. 

Updated Date - 2020-10-28T09:22:27+05:30 IST