ప్రాణం తీసిన అతి వేగం

ABN , First Publish Date - 2020-10-27T10:39:19+05:30 IST

అతి వేగానికి ఓ యువకుడు బలైపోయాడు. ఎండాడ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు డివైడర్‌ను ఢీకొనడంతో సోమవారం మధ్యాహ్నం అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రాణం తీసిన అతి వేగం

మరొకరికి గాయాలు

ఎండాడ, అక్టోబరు 26: అతి వేగానికి ఓ యువకుడు బలైపోయాడు. ఎండాడ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు డివైడర్‌ను ఢీకొనడంతో సోమవారం మధ్యాహ్నం అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ కుప్పిలి సన్యాసిరావు, ఆరిలోవ ఎస్‌ఐ అప్పారావు అందించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హెచ్‌బీ కాలనీలో ఉంటున్న నక్కా రాములప్పడు (24), సంగివలసలో ఉంటున్న కోరాడ నారాయణ కలిసి ద్విచక్ర వాహనంపై నగరం నుంచి మధురవాడ వైపు వెళుతుండగా జూ పార్కు దాటాక ఎండాడ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో హైవే మధ్యలో ఉన్న డివైడర్‌ను బైక్‌ ఢీకొని కాలువలోకి దూసుకుపోయింది. దీంతో రాములప్పడు అక్కడికక్కడే మృతి చెందగా, కోరాడ నారాయణ చెయ్యి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మృతుడు రాములప్పడుకు రెండేళ్ల కిందటే వివాహమైందని, హెచ్‌బీ కాలనీలోని ఫర్నిచర్‌ షాప్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టమార్టానికి తరలించి ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-27T10:39:19+05:30 IST