తల్లికి పెద్దకర్మ రోజునే

ABN , First Publish Date - 2020-10-13T10:30:32+05:30 IST

మండలంలో తునివలస గ్రామానికి చెందిన బుర్ర కథ కళాకారుడు సుంకర శంకరరావు(35) బ్లడ్‌ క్యాన్సర్‌తో విశాఖ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి పది గంటల తర్వాత మృతిచెందాడు.

తల్లికి పెద్దకర్మ రోజునే

 కొడుకు అనారోగ్యంతో మృతి


చీడికాడ: మండలంలో తునివలస గ్రామానికి చెందిన బుర్ర కథ కళాకారుడు సుంకర శంకరరావు(35) బ్లడ్‌ క్యాన్సర్‌తో విశాఖ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి పది గంటల తర్వాత మృతిచెందాడు. ఇటీవల గాయపడడంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్స కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బ్లడ్‌ క్యాన్సర్‌ సోకిందని వైద్యులు నిర్ధారించారు.


కొడుక్కి బ్లడ్‌ క్యాన్సర్‌ అని తెలుసుకున్న శంకరరావు తల్లి రమణమ్మ ఆందోళనకు గురై గత నెల 29న రాత్రి మృతిచెందగా, రమణమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం రాత్రి శంకరరావు మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈయన మృతితో చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Updated Date - 2020-10-13T10:30:32+05:30 IST