జీవీఎంసీ పరిధిలో ఎనిమిది కంట్రోల్‌ రూమ్‌లు

ABN , First Publish Date - 2020-10-13T10:27:23+05:30 IST

తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

జీవీఎంసీ పరిధిలో ఎనిమిది కంట్రోల్‌ రూమ్‌లు

12 చోట్ల పునరావాస కేంద్రాలు


విశాఖపట్నం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ఎవరైనా ఇబ్బందికి గురైతే తక్షణం సహాయం అందించేందుకు వీలుగా జీవీఎంసీ పరిధిలోని ప్రతీ జోన్‌లోనూ ఒక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముంపుప్రాంతాల్లోని ప్రజలకు పునరావాసం కల్పించేందుకు జోన్‌-4, జోన్‌-5లలో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందరికీ ఆహారం, చంటిపిల్లలు, గర్భిణులు ఉన్నట్టయితే వారికి పాలు కూడా అందించాలని కమిషనర్‌ ఆదేశాల మేరకు యూసీడీ పీడీ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-10-13T10:27:23+05:30 IST