ఎన్‌ఐఎస్‌ డిప్లొమా పరీక్షలో స్విమ్మర్‌ రవితేజ ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2020-10-12T11:37:02+05:30 IST

నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్‌ గ్రంధి రవితేజ స్విమ్మింగ్‌ కోచ్‌ పరీక్షలో డిప్లొమా సాధించాడు. పటియాలలోని స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు(శాయ్‌) చెందిన నేతాజి సుభాష్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్సులో ఉత్తీర్ణత పొంది మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్సు సైన్సెస్‌ పరీక్షకు అర్హత సాధించాడు.

ఎన్‌ఐఎస్‌ డిప్లొమా పరీక్షలో స్విమ్మర్‌ రవితేజ ఉత్తీర్ణత

విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 11: నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్‌ గ్రంధి రవితేజ స్విమ్మింగ్‌ కోచ్‌ పరీక్షలో డిప్లొమా సాధించాడు. పటియాలలోని స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు(శాయ్‌) చెందిన నేతాజి సుభాష్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్సులో  ఉత్తీర్ణత పొంది మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్సు సైన్సెస్‌ పరీక్షకు అర్హత సాధించాడు. స్విమ్మింగ్‌ క్రీడాంశంలో మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్సు సైన్సెస్‌ (ఎంఎస్‌సీ) పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి హాజరవుతున్న తొలి కోచ్‌గా రికార్డు నెలకొల్పాడు.


స్విమ్మింగ్‌ క్రీడాకారునిగా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన రవితేజ, గుర్తింపు కోచ్‌గా అర్హత సాధించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎమోహన్‌ వెంకటరామ్‌, ఇతర ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-12T11:37:02+05:30 IST