పోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం!

ABN , First Publish Date - 2020-10-04T11:15:08+05:30 IST

విశాఖపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం గుర్తించి పోర్టు యాజమాన్యం శనివారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం!

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం గుర్తించి పోర్టు యాజమాన్యం శనివారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి, నాలుగో తరగతి ఉద్యోగాలు ఖాళీ వున్నాయని ప్రచారం చేస్తున్నారు.


దరఖాస్తు రుసుము రూ.1,200 పేటీఎం ద్వారా చెల్లించాలని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆ మొత్తంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దీని వెనుక  ఎవరు వున్నారో గుర్తించాలని, వారిపై చర్యలు చేపట్టాలని పోర్టు యాజమాన్యం ఫిర్యాదులో కోరింది.

Updated Date - 2020-10-04T11:15:08+05:30 IST