నేడు సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్ష

ABN , First Publish Date - 2020-10-04T11:13:53+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆది వారం సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్ష జరగను న్నది.

నేడు సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్ష

నగరంలో 27 కేంద్రాలు

10,769 మంది అభ్యర్థులు

పరీక్ష ప్రారంభ సమయానికి

పది నిమిషాలు ముందుగా రాకుంటే అనుమతి నిరాకరణ


విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆది వారం సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్ష జరగను న్నది. రెండు పూటలా జరిగే ఈ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో 27 కేంద్రాల్లో 10,769 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరగను న్నాయి. గంట ముందు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభ సమయానికి పది నిమిషాల ముందు వరకు మాత్రమే అభ్యర్థులను హాలులోకి అనుమతిస్తామని స్పష్టంచేశారు.


కరోనా నేపథ్యంలో అభ్యర్థులు విఽధిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. కాగా పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికా రులతో కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి శనివారం టెలికా న్ఫరెన్స్‌ నిర్వహించారు. డీఆర్వో నేతృత్వంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపు తోంది. ఈ పరీక్షలకు పరిశీలకులుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సాయిప్రసాద్‌, కాంతిలాల్‌ దండే కేంద్రాలను తనిఖీ చేయనున్నారు.

Updated Date - 2020-10-04T11:13:53+05:30 IST