సచివాలయ వ్యవస్థ భేష్
ABN , First Publish Date - 2020-10-03T09:20:48+05:30 IST
సచివాలయ వ్యవస్థతో సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.

ఎమ్మెల్యే ఫాల్గుణ
అరకురూరల్, అక్టోబర్ 2: సచివాలయ వ్యవస్థతో సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి స్థానిక జడ్పీ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సమక్షంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కొవ్వొత్తులు వెలిగించి, చప్పట్లు కొట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. సచివాలయాల ద్వారా లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.అనంతరం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఎమ్మెల్యే ఫాల్గుణ సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో జీవీ. రాంబాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.