-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vsp hpcl
-
హెచ్‌పీసీఎల్‌లో భద్రతపై వర్క్‌షాపు
ABN , First Publish Date - 2020-12-30T05:34:54+05:30 IST
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)లో భద్రతపై నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది

విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)లో భద్రతపై నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్క్‌షాపులో మొదటి రోజు క్షేత్రంలో చేపట్టాల్సిన చర్యలు గురించి , రెండో రోజు సాంకేతిక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పనిచేసే వాతావరణం, అక్కడి పరిస్థితులు, ప్రమాదం జరిగినపుడు స్పందించాల్సిన విధానాలపై వివరించారు. ఇందులో ఏపీపీసీబీ నుంచి జేసీఈఈ రాజేంద్ర రెడ్డి, ఎస్‌ఈ రవీంద్రనాఽథ్, డీఎఫ్‌ఓ బీవీ రామ్‌ప్రకాశ్, హెచ్‌పీసీఎల్ సీజీఎంలు రామకృష్ణన్, సోమసుందర్, జనరల్ మేనేజర్ ఏటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.