ఇళ్లపట్టాల పంపిణీకి సన్నద్ధంకండి

ABN , First Publish Date - 2020-12-15T06:01:26+05:30 IST

ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు.

ఇళ్లపట్టాల పంపిణీకి సన్నద్ధంకండి
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

అఽధికారులకు కలెక్టర్‌ ఆదేశం

విశాఖపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా లేవుట్లు వివరాలు ప్రతి ఒక్కరి నుంచి అడిగి తెలుసుకున్నారు.  ఈ నెల 25న ఇళ్లపట్టాల పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అటు తరువాత ఎమ్మెల్యేలు తమ పరిధిలో పట్టాలు అందజేసే కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు. జేసీ వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, ఐటీడీఎ పీవో వెంకటేశ్వర్‌, నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ ఎన్‌.మౌర్య, డీఆర్వో ప్రసాద్‌, ఆర్డీవోలు పెంచల కిశోర్‌, సీతారామారావు, ఎల్‌ శివజ్యోతి పాల్గొన్నారు. 

పట్టాల పంపిణీకి ప్రత్యేక అధికారులు

పట్టాల పంపిణీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించామని కలెక్టర్‌ తెలిపారు. పాడేరుకు ఐటీడీఎ పీవో వెంకటేశ్వర్‌, నర్సీపట్నానికి సబ్‌ కలెక్టర్‌ మౌర్య, అరకుకు పాడేరు సబ్‌కలెక్టర్‌ శివజ్యోతి, భీమిలికి విశాఖ ఆర్డీవో పెంచల కిశోర్‌, అనకాపల్లికి ఆర్డీవో సీతారామారావును నియమించామన్నారు. పాయకరావుపేటకు డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, ఎలమంచిలికి ఎస్డీసీ అనిత, చోడవరానికి ఎస్డీసీ ఎంవీసూర్యకళ, మాడుగులకు ఎస్డీసీ సీహెచ్‌.రంగయ్య, పెందుర్తికి ఎస్డీసీ  పద్మలత, జీవీఎంసీ పరిధిలో సెగ్మెంట్‌లకు కమిషనర్‌ సృజన ప్రత్యేక అధికారులగా పట్టాల పంపిణీ పర్యవేక్షిస్తారని తెలిపారు. 


Updated Date - 2020-12-15T06:01:26+05:30 IST