రెండో రోజు 308

ABN , First Publish Date - 2020-03-13T11:35:38+05:30 IST

రెండో రోజు 308

రెండో రోజు 308

వైసీపీ నుంచి 107, టీడీపీ 100,

జనసేన 22, స్వతంత్రులు 55

14 వార్డులకు బోణీ లేదు

నామినేషన్ల దాఖలుకు నేటితో ముగియనున్న గడువు

జాబితాల ప్రకటనలో దోబూచులాట

40 మందితో జాబితా ప్రకటించిన వైసీపీ

మరో 58 పెండింగ్‌

చెరిసగం పంచుకున్న బీజేపీ, జనసేన

49 మందిని ఖరారు చేసిన కమలం పార్టీ


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలకు నామినేషన్లు జోరందుకున్నాయి. రెండో రోజు గురువారం జోనల్‌ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. పార్టీ నుంచి భరోసా లభించిన వారితో పాటు ఆశావహులంతా మందీ మార్బలంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లు సమర్పించారు. ఒక్క గురువారమే 84 వార్డులకు 308 నామినేషన్లు దాఖలయ్యాయి. జీవీఎంసీలో మొత్తం వార్డులు 98 కాగా ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అత్యధికంగా వైసీపీ నుంచి 107 మంది నామినేషన్లు వేయగా, తెలుగుదేశం నుంచి 100 మంది, జనసేన పార్టీ నుంచి 22 మంది, కాంగ్రెస్‌ నుంచి 20 మంది, సీపీఎం నుంచి 17 మంది, బీజేపీ, సీపీఐల నుంచి చెరో ఆరుగురు, బీఎస్‌పీ నుంచి ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరు కాకుండా స్వతంత్రులు మరో 55 మంది నామినేషన్లు సమర్పించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే...వార్డుల సంఖ్య 98 కాగా ఒక్క గురువారమే వైసీపీ నుంచి 107 మంది నామినేషన్లు వేశారు. అంటే వున్న వార్డుల కంటే నామినేషన్లు ఎక్కువ పడుతున్నాయి. తెలుగుదేశం నుంచి కూడా అలాగే 100 మంది వేశారు. 


వార్డుల వారీగా దాఖలైన నామినేషన్లు

జీవీఎంసీలో మొత్తం 98 వార్డులు వుండగా రెండో రోజు గురువారం 308 మంది నామినేషన్లు వేశారు. 1వ వార్డుకు 1, 2వ వార్డుకు 5, 3వ వార్డుకు 3, 4వ వార్డుకు 4, 7వ వార్డుకు 2, 8వ వార్డుకు 1 , 9వ వార్డుకు 7, 10వ వార్డుకు 2, 11వ వార్డుకు 4, 12వ వార్డుకు 1, 13వ వార్డుకు 4, 14వ వార్డుకు 2, 15వ వార్డుకు 2, 16వ వార్డుకు 1, 17వ వార్డుకు 5, 18వ వార్డుకు 1, 19వ వార్డుకు 1, 20వ వార్డుకు 1, 21వ వార్డుకు 9, 22వ వార్డుకు 3, 24వ వార్డుకు 7, 25వ వార్డుకు 3, 26వ వార్డుకు 2, 27వ వార్డుకు 1, 28వ వార్డుకు 2, 29వ వార్డుకు 2, 31వ వార్డుకు 11, 32వ వార్డుకు 4, 33వ వార్డుకు 6, 34వ వార్డుకు 1, 35వ వార్డుకు 5, 36వ వార్డుకు 7, 37వ వార్డుకు 8, 38వ వార్డుకు 8, 39వ వార్డుకు 5, 40వ వార్డుకు 3, 42వ వార్డుకు 6, 44వ వార్డుకు 4, 45వ వార్డుకు 1, 46వ వార్డుకు 5, 47వ వార్డుకు 4, 48వ వార్డుకు 2, 49వ వార్డుకు 2, 50వ వార్డుకు 3, 52వ వార్డుకు 3, 53వ వార్డుకు 2, 55వ వార్డుకు 3, 56వ వార్డుకు 6, 57వ వార్డుకు 2, 58వ వార్డుకు 2, 59వ వార్డుకు 4, 60వ వార్డుకు 5, 61వ వార్డుకు 3, 62వ వార్డుకు 2, 63వ వార్డుకు 6, 64వ వార్డుకు 4, 66వ వార్డుకు 9, 67వ వార్డుకు 4, 68వ వార్డుకు 4, 69వ వార్డుకు 4, 70వ వార్డుకు 7, 71వ వార్డుకు 2, 72వ వార్డుకు 9, 73వ వార్డుకు 6, 76వ వార్డుకు 7, 77వ వార్డుకు 3, 78వ వార్డుకు 1, 79వ వార్డుకు 2, 80వ వార్డుకు 2, 81వ వార్డుకు 1, 82వ వార్డుకు 1, 83వ వార్డుకు 2, 84వ వార్డుకు 1, 85వ వార్డుకు 9, 86వ వార్డుకు 3, 87వ వార్డుకు 6, 88వ వార్డుకు 1, 89వ వార్డుకు 3, 90వ వార్డుకు 6, 91వ వార్డుకు 4, 92వ వార్డుకు 5, 95వ వార్డుకు 1, 97వ వార్డుకు 1, 98వ వార్డుకు 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.


14 వార్డులకు బోణీ లేదు

విచిత్రంగా 98వ వార్డుల్లో 14 వార్డులకు ఈ రెండు రోజుల్లోను ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. 5, 6, 23, 30, 41, 43, 51, 54, 65, 74, 75, 93, 94, 96 వార్డుల్లో ఏ పార్టీ అభ్యర్థి కూడా నామినేషన్‌ వేయలేదు. స్వతంత్రులు ముందుకు రాలేదు.


నేటితో గడువు సమాప్తి

నామినేషన్ల సమర్పణకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసిపోతుంది. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులంతా ఆఖరి రోజే నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. బీఫారం అందుకున్నవారు పార్టీ అభ్యర్థులుగా, లేనివారు రెబల్స్‌గా మిగిలే అవకాశం ఉంది.


జాబితాల ప్రకటనలో దోబూచులాట

జీవీఎంసీలో ఉన్నవి 98 వార్డులు. ప్రతి వార్డుకు ప్రధాన పార్టీల్లో నలుగురు నుంచి ఆరుగురు పోటీ పడుతున్నారు. దాంతో టిక్కెట్ల పంపిణీ నాయకులకు తలనొప్పిగా మారింది. వైసీపీ తొలుత గురువారం ఉదయం 40 మందితో జాబితా ప్రకటించింది. అందులో పేర్లు వున్నవారితో పాటు మరికొందరు కూడా అదే వార్డులకు నామినేషన్లు వేశారు. ఎవరు బీఫారం సమర్పిస్తే వారే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. మలి విడత జాబితాను శుక్రవారం ప్రకటిస్తామని వైసీపీ పేర్కొంది.


బీజేపీ-జనసేనలు

బీజేపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఈ రెండు పార్టీలు చెరో 49 సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. బీజేపీ తరపున కార్పొరేషన్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి విష్ణుకుమార్‌రాజు బీజేపీ నుంచి పోటీ చేసే వారి జాబితా గురువారం రాత్రి విడుదల చేశారు. జనసేన నియోజకవర్గాల వారీగా పేర్లను ఖరారు చేసినా, మొత్తం జాబితా విడుదలకు ఇంకా సమయం పడుతుందని పేర్కొంది.

 

సీపీఎం జీవీఎంసీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. గురవారం ఒక్క రోజే 17 మందితో నామినేషన్లు వేయించింది. సీపీఐ నుంచి ఆరుగరు నామినేషన్లు వేశారు. బీఎస్‌పీ నుంచి ముగ్గురు వేయగా, స్వతంత్రులు 55 మంది నామినేషన్లు సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు రానివారు కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. 


Updated Date - 2020-03-13T11:35:38+05:30 IST