ఘాట్‌ రోడ్డులో కారు దగ్ధం

ABN , First Publish Date - 2020-03-13T11:31:27+05:30 IST

ఘాట్‌ రోడ్డులో కారు దగ్ధం

ఘాట్‌ రోడ్డులో కారు దగ్ధం

అనంతగిరి, మార్చి 12: అనంతగిరి ఘాట్‌ రోడ్డులోని తైడా సమీపంలో గురువారం మధ్యాహ్నం ఈకో స్పోర్ట్‌ కారు దగ్ధమైంది. నలుగురు ప్రయాణికులు విశాఖపట్నం నుంచి ఒడిసా వెళ్తుండగా తైడా సమీపంలో బోనెట్‌ నుంచి పొగలు వచ్చాయి. దీంతో రహదారి పక్కన కారు ఆపివేయగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులు కారు దిగి పరుగులు తీశారు. వారు చూస్తుండగానే క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి అగ్నికి ఆహూతైంది. బాధితులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌.కోట నుంచి వాహనం వచ్చింది. అప్పటికే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. వాటిని ఆపి వేసి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-03-13T11:31:27+05:30 IST