పారదర్శకంగా ఎన్నికలను నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2020-03-13T11:28:02+05:30 IST

పారదర్శకంగా ఎన్నికలను నిర్వర్తించాలి

పారదర్శకంగా ఎన్నికలను నిర్వర్తించాలి

అధికారులకు ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం


విశాఖపట్నం, మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా సాగాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌, పురపాలక, నగరపాలక, గ్రామ పంచాయతీ ఎన్నికలకు పరిశీలకులుగా నియమితులైన ఆయన గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ అధికారులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్టయితే ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించగలుగుతారన్నారు. పురపాలక, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకే నెలలో మూడు, నాలుగు ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చినందున కార్యాచరణ ప్రణాళికాయుతంగా ఉండాలన్నారు. చాలాకాలం తర్వాత బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా ప్రజలకు, రాజకీయ పార్టీల అభ్యర్థులకు అధికార యంత్రాంగంపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వర్తించాలన్నారు. 

కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ రిటర్నింగ్‌, నోడల్‌, జోనల్‌, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది విధులను నిబంధనల మేరకు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, సహాయ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, పాడేరు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T11:28:02+05:30 IST