స్థానికేతరులకు టిక్కెట్లా?

ABN , First Publish Date - 2020-03-13T11:27:19+05:30 IST

స్థానికేతరులకు టిక్కెట్లా?

స్థానికేతరులకు టిక్కెట్లా?

మద్దిలపాలెం, మార్చి 12: పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న వారిని కాదని స్థానికేతరులకు జీవీఎంసీ ఎన్నికల్లో టిక్కెట్లు ఎలా ఇస్తారని 61 వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు పిల్లా కనకరాజు అలియాస్‌ కన్నబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నారనే సమాచారంతో 61వ వార్డు వైసీపీ నాయకులు వచ్చారు. జీవీఎంసీలో పార్టీ నుంచి పోటీ చేసే 40 వార్డులకు అభ్యర్థుల జాబితాను ఎన్నికల ఇన్‌చార్జ్‌ దాడి వీరభద్రరరావు విడుదల చేశారు. ఈ జాబితాలో 61వ వార్డు లేకపోవడంతో టిక్కెట్‌ ఆశించిన పిల్లా కనకరాజు అలియాస్‌ కన్నబాబు ఆగ్రహంతో ఊగిపో యారు. 48వ వార్డులో కార్పొరేటర్‌గా పనిచేసిన తాను కొత్తవార్డుగా మారిన 61వ వార్డులో పార్టీకి పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌ బంధువు అనకాపల్లికి చెందిన కొణతాల సుధను అభ్యర్థిగా ఎంపిక చేశారని వాపోయారు. దీనిపై సమన్వయకర్తను నిలదీయగా నా చేతుల్లో ఏమీ లే దు.. అధిష్ఠానం నిర్ణయమేనని చెబుతున్నారని, కొణతాల సుధ స్థానికులు కాదని, ఆమె విజయం కష్టమని అసం తృప్తి వ్యక్తం చేశారు. ఇతడితో పాటు అదే వార్డుకు చెందిన మరికొంతమంది మళ్ల విజయప్రసాద్‌ బంధువుకు సీటు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చే శారు. ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులకు కాదని ఎక్కడినుంచో తీసుకొచ్చి టిక్కెట్‌ ఇవ్వడం అన్యాయమని వాదనకు దిగారు. తన గోడు మీడియా ముందు వెళ్లగక్కుతున్న కన్నబాబు, అతని మద్దతుదారుల ను పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలని నాయ కులు ఆదేశించడంతో గొడవకు దిగారు. పార్టీలో పని చేస్తు న్నామని తాము ఎందుకు బయటకు వెళ్తామని ప్రశ్నించా రు. ఇదే సమయంలో 17వ వార్డుకు చెందిన మరికొందరు నాయకులు కూడా పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు. 17వ వార్డులో గవరులున్నారని వారికే  సీటు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-03-13T11:27:19+05:30 IST