-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vsez
-
అచ్యుతాపురం సెజ్ వృద్ధి రేటు 24 శాతం
ABN , First Publish Date - 2020-12-10T05:35:23+05:30 IST
కరోనా కష్ట కాలాన్ని అధిగమించి అచ్యుతాపురం ఏపీ సెజ్ 24 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వీఎస్‌ఈజడ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆవుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

కూర్మన్నపాలెం(విశాఖపట్నం), డిసెంబరు 9: కరోనా కష్ట కాలాన్ని అధిగమించి అచ్యుతాపురం ఏపీ సెజ్ 24 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వీఎస్‌ఈజడ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆవుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. దువ్వాడ వీఎస్‌ఈజడ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది మూడవ త్రైమాసానికి అచ్యుతాపురం సెజ్ ఎగుమతులు ద్వారా రూ.2,815 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది మూడవ త్రైమాసానికి రూ.3,477 కోట్లుతో 24 శాతం వృద్ధి రేటు సాధించిందని వివరించారు. ఎగుమతులలో మూడవ వంతు లారస్ ల్యాబ్స్‌కు చెందినవని తెలిపారు.