ప్లానిటోరియం ప్రాజెక్టుపై వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-12-25T05:49:14+05:30 IST

వీఎంఆర్డీఏ ప్రతిపాదిత ప్లానిటోరియం మ్యూజియానికి సంబంధించి నిర్మాణ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం సాయంత్రం వీఎంఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్‌ పి.కోటేశ్వరరావు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్లానిటోరియం ప్రాజెక్టుపై వీడియో కాన్ఫరెన్స్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కోటేశ్వరరావు, తదితరులు

పలు సూచనలు చేసిన వీఎంఆర్డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు

సిరిపురం, డిసెంబరు 24: వీఎంఆర్డీఏ ప్రతిపాదిత ప్లానిటోరియం మ్యూజియానికి సంబంధించి నిర్మాణ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం సాయంత్రం వీఎంఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్‌ పి.కోటేశ్వరరావు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్లానిటోరియం నిర్మాణం,  ఆర్కిటెక్చర్‌, సాంకేతికపరంగా ఎటువంటి అవాంతరాలు రాకుండా అందుబాటులో ఉన్న అత్యంత అత్యాధునిక ఆడియో, వీడియో, ఎకోస్టిక్స్‌లపై సుదీర్ఘంగా చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు. సిట్టింగ్‌, డ్రోమ్‌ స్ట్రక్చర్‌, డిజిటల్‌ ప్రాజెక్టర్‌ థియేటర్‌లో ఉష్ణోగ్రత సమత్యులత నిర్వహణ, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు. దేశ విదేశీ విద్యార్థులను, పర్యాటకులను ఆకట్టుకునేలా.. సమావేశాలు, వర్కుషాప్స్‌ నిర్వహించుకునేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లానిటోరియం ఎక్విప్‌మెంట్‌ ప్రొవైడర్స్‌ ఇండియన్‌ ఇన్ఫోవిజన్‌ ప్రతినిధులు, ఇండియన్‌ ఆర్బిట్‌ యానిమేషన్‌ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్‌ నారాయణరెడ్డి, తదితరులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ మనజీర్‌ జిలానీ, కార్యదర్శి గణేశ్‌కుమార్‌, కోల్‌కతా సైన్స్‌ మ్యూజియం మాజీ క్యూరేటర్‌ డా.జిలానీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-25T05:49:14+05:30 IST