అనధికార లేవట్లను గుర్తిస్తున్నాం..

ABN , First Publish Date - 2020-11-21T05:42:52+05:30 IST

అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లను గుర్తిస్తున్నామని వీఎంఆర్డీఏ అధికారి వి.సూర్యనారాయణ తెలిపారు.

అనధికార లేవట్లను గుర్తిస్తున్నాం..
లేఅవుట్లను పరిశీలిస్తున్న వీఎంఆర్డీఏ అధికారులు

వీఎంఆర్డీఏ అధికారి సూర్యనారాయణ


అనకాపల్లి రూరల్‌, నవంబరు 20: అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లను గుర్తిస్తున్నామని వీఎంఆర్డీఏ అధికారి వి.సూర్యనారాయణ తెలిపారు. తుమ్మపాల-దిబ్బపాలెం మార్గంలో శుక్రవారం లేఅవుట్లను పరిశీలించామని చెప్పారు. అనకాపల్లి మండలంలో దాదాపు 50 అనధికార లేఅవుట్లను గుర్తించామన్నారు. ఆయన వెంట వీఎంఆర్డీఏ సిబ్బంది ఉన్నారు.


అనధికార లేఅవుట్లు రెగ్యులరైజ్‌ చేసుకోండి

కశింకోట: అనధికార లే అవుట్‌లు, నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేసుకోవాలని వుడా ప్లానింగ్‌ అధికారి వీఎస్‌ఎన్‌ సాయిబాబా సూచించారు. కశింకోటలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో శుక్రవారం  సమీక్షించారు. డిసెంబరులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వుడా ఏపీవో కిశోర్‌, ప్లానింగ్‌ సెక్రటరీ సాయిశరణ్‌, ఎంపీడీవో కె.హరిప్రసాద్‌, ఈవోఆర్డీ కె.ధర్మారావు పాల్గొన్నారు.

Read more