పారదర్శకంగా దుకాణాల వేలం

ABN , First Publish Date - 2020-12-15T05:54:01+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)కు సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, ఉద్యోగ భవన్‌, హరిత హౌసింగ్‌, సిటీ సెంట్రల్‌ పార్కుల్లో ఖాళీగా ఉన్న దుకాణాలను వీలైనంత త్వరగా వేలం ద్వారా అద్దెకు ఇవ్వాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కమిషనర్‌ కోటేశ్వరరావు ఆదేశించారు.

పారదర్శకంగా దుకాణాల వేలం
అధికారులతో సమీక్షిస్తున్న కమిషనర్‌ కోటేశ్వరరావు

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు

విశాఖపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)కు సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, ఉద్యోగ భవన్‌, హరిత హౌసింగ్‌, సిటీ సెంట్రల్‌ పార్కుల్లో ఖాళీగా ఉన్న దుకాణాలను వీలైనంత త్వరగా వేలం ద్వారా అద్దెకు ఇవ్వాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కమిషనర్‌ కోటేశ్వరరావు ఆదేశించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో పరిపాలన, న్యాయ విభాగాల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్టేట్‌ విభాగానికి సంబంధించి 50 కేసులకు, ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి 75 కేసులకు ఈ నెలాఖరులోగా న్యాయస్థానాల్లో కౌంటర్లు, అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించారు. సంస్థకు ప్రయోజనం కలిగించే పనుల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని హెచ్చరించారు. అచ్యుతాపురంలోని ఏపీ సెజ్‌ వరకు నిర్మించే మాస్టర్‌ ప్లాన్‌ రహదారికి అసరమైన భూసేకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ ఎంఎస్‌ జిలానీ, సెక్రటరీ గణేశ్‌ కుమార్‌, ఎస్‌ఈ రామమోహన్‌రావు, సీయూపీ సురేశ్‌, ఈఓ లక్ష్మణమూర్తి, డీఎఫ్‌ఓ శాంతి స్వరూప్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ నిర్మలమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-15T05:54:01+05:30 IST