పెద్దకూతురు కోసం చర్చ్ వద్దకు వెళ్తే.. అక్కడ పాస్టర్ కనపడడంతో.. అనుమానం వచ్చి..

ABN , First Publish Date - 2020-10-07T16:58:13+05:30 IST

బాలిక(16)పై పాస్టర్‌ అత్యాచారయత్నానికి..

పెద్దకూతురు కోసం చర్చ్ వద్దకు వెళ్తే.. అక్కడ పాస్టర్ కనపడడంతో.. అనుమానం వచ్చి..

బాలికపై పాస్టర్‌ అత్యాచార యత్నం


గాజువాక: బాలిక(16)పై పాస్టర్‌ అత్యాచారయత్నానికి ఒడిగట్టిన సంఘటన మంగళవారం గాజువాక వాంబే కాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గాజువాక సనత్‌నగర్‌ వాసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ముగ్గురు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) పిల్లలను పోషించుకుంటున్నాడు. భార్య చనిపోయింది. సోమవారం ఉదయం వాంబే కాలనీలో వున్న చర్చికి ముగ్గురు పిల్లలను తీసుకువెళ్లాడు. తరువాత చర్చి పాస్టర్‌ మునిబాబు అలియాస్‌ హెబెల్‌(32)తో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు వెళ్లారు.


అక్కడ ప్రార్థనలు ముగిసిన తరువాత బయలుదేరి రాత్రికి వాంబే కాలనీలోని చర్చికి చేరుకున్నారు. అంతా చర్చిలోనే నిద్రించారు. మంగళవారం ఉదయం 9:00 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని వెళుతూ పెద్ద కుమార్తె(16)ను నడుచుకుంటూ రమ్మని చెప్పాడు. కానీ ఆమె రాకపోవడంతో తిరిగి చర్చి వద్దకు వచ్చాడు. అక్కడ అమ్మాయితోపాటు పాస్టర్‌ హెబెల్‌ వుండడంతో తన వెంట ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. పాస్టర్‌ తనను వెనక్కు పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో ఆయన గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పాస్టర్‌ హెబెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు

Read more