-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » visakhapatnam news vegetable market
-
నేటి నుంచి ఏఎస్ రాజా కళాశాల మైదానంలో కూరగాయల విక్రయాలు: జేసీ శివశంకర్
ABN , First Publish Date - 2020-03-25T11:52:31+05:30 IST
నేటి నుంచి ఏఎస్ రాజా కళాశాల మైదానంలో కూరగాయల విక్రయాలు: జేసీ శివశంకర్

ఎంవీపీ కాలనీ, మార్చి 25 : ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించే రైతులు బుధవారం నుంచి సమీపంలోని ఏఎస్ రాజా గ్రౌండ్‌లో విక్రయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఏఎస్ రాజా కళాశాల మైదానాన్ని మంగళవారం సాయంత్రం జేసీ పరిశీలించారు. దీనివల్ల సామాజిక దూరం పాటించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అయితే కమర్షియల్ దుకాణదారులు మాత్రం తమ సరుకును రైతుబజార్ ఆవరణలోనే విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే విక్రయాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎం కాళేశ్వరరావు, ఎస్టేట్ ఆఫీసర్ నలమహారాజు, సీఐ షణ్ముఖరావు పాల్గొన్నారు.