జిల్లాలో తాత్కాలిక అదనపు రైతు బజార్లు

ABN , First Publish Date - 2020-03-25T12:03:56+05:30 IST

జిల్లాలో తాత్కాలిక అదనపు రైతు బజార్లు

జిల్లాలో తాత్కాలిక అదనపు రైతు బజార్లు

అదనంగా 12 ఏర్పాటు..అనకాపల్లి, నర్సీపట్నంలలో బజార్లు

31 వరకు కొనసాగింపు


విశాఖపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయంలో సామాజిక దూరం పాటించేందుకు నగరంలో ఉన్న రైతుబజార్లకు అదనంగా తాత్కాలిక బజార్లు ఏర్పాటు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ వెల్లడించారు. బుధవారం  ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తాత్కాలిక బజార్లు పనిచేస్తాయని తెలిపారు. ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా పోలీస్‌ బందోబస్తు ఉంటుందన్నారు.


ఈ నెల 31 వరకు ఇవి పనిచేస్తాయని వివరించారు. నగరంలో ఉక్కు మైదానం(సీతమ్మధార), ఏఎస్‌ రాజా మైదానం(ఎంపీవీకాలనీ), డీఎల్‌బీ మైదానం (నరసింహనగర్‌), గౌరీ డిగ్రీ కళాశాల (కంచరపాలెం), ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(పెందుర్తి), ఏయూ మైదానం(పెదవాల్తేరు), స్టెల్లామేరీ స్కూలు(మర్రిపాలెం), అంబే డ్కర్‌ కాలనీ ఖాళీ మైదానం(గాజువాక), చైతన్య కళాశాల(మధురవాడ), శివశివానీ స్కూలు, లిటిల్‌ ఏంజిల్స్‌(ఉక్కునగరం), పెదగంట్యాడ ఉన్నత పాఠశాల(పెదగంట్యాడ)తోపాటు అనకాపల్లి బెల్లం మార్కెట్‌, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల(నర్సీపట్నం)లో బజార్లు అందుబాటులో ఉంటాయి.

Read more