నేడు దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-03-08T09:15:46+05:30 IST

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా నిర్మించిన దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం..

నేడు దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా నిర్మించిన దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ప్రారంభించనున్నారు. ఎండాడ వద్ద జాతీయరహదారిని ఆనుకుని కొత్తగా నిర్మించిన భవనంలోని మొదటి అంతస్థును దిశ పోలీస్‌స్టేషన్‌ కోసం కేటాయించిన విషయం తెలిసిందే. 

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్నప్పటికీ వీలుకాకపోవడంతో జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా సంయుక్తంగా దీనిని ప్రారంభించాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-03-08T09:15:46+05:30 IST