వెలగపూడికి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సవాల్

ABN , First Publish Date - 2020-12-25T19:38:00+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు, వెలగపూడిపై ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా

వెలగపూడికి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సవాల్

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, వెలగపూడిపై ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబుకు బుద్ధి రాలేదని అన్నారు. ప్రజల ఇళ్ల పట్టాలను అడ్డుకోనే కుట్రలు చంద్రబాబు చేశారని ఆరోపించారు. ఎంపీ విజయసాయి రెడ్డి మీద వెలగపూడి ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెలగపూడి తీరు చూసి దెయ్యాలు వేదాలు వాళ్ళించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డికి సవాల్ చేసే స్థాయి వెలగపూడికి లేదన్నారు.  ప్రమాణాలు చేస్తామనడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని యెద్దేవా చేశారు.


‘‘వైకుంఠ ఏకాదశి రోజున నేను సవాల్ చేస్తున్నా.. సింహాచలం అప్పన్న సాక్షిగా ఎలాoటి భూ అక్రమాలకు పాల్పడలేదని వెలగపూడి ప్రమాణం చేయగలరా. 40 ఏళ్ల రాజకీయాల్లో ఉన్న  కుటుంబం  నుంచి వ్యక్తిగా తాను ప్రమాణం చేస్తాను.. అందుకు నువ్వు సిద్ధమేనా..సమయం, సమాధానం, వెలగపూడి చెప్పాలి..వీధి రౌడీ లాగా వెలగపూడి మాట్లాడుతున్నారు..వెలగపూడి వీధి రౌడిగా మొదలై కిల్లర్‌గా తయారయ్యాడు..హత్యలు , దౌర్జన్యాలు , రౌడీయిజం చేసిన వ్యక్తి వెలగపూడి.. వంగవీటి రంగ హత్యకేసులో వెలగపూడి ముద్దాయి.. వంగవీటి రంగను హత్య చేసి వైజాగ్ పారిపోయి వచ్చాడు.. గుర్రపు పందేలు ఆడించడం, మద్యం వ్యాపారం, మత్తు పదార్థాలు సరఫరా చేయడం వెలగపూడికి అలవాటు..విజయవాడలో వెలగపూడి ని బహిష్కరిస్తే వైజాగ్ వచ్చాడు. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేయించి వెలగపూడి గెలిచాడు’’అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


విశాఖ ప్రజలు రాజకీయంగా ఆదరిస్తే విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వాసానికి మారు పేరు విజయసాయిరెడ్డి అని స్పష్టం చేశారు. విశాఖలో 2 వేల కోట్ల విలువైన భూములను అధికారాలు స్వాధీనం చేసుకున్నారు అంటే అది సాయిరెడ్డి చలవే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 420 అయితే వెలగపూడి 840 అని అన్నారు. రంగాను హత్య చేసి వైజాగ్ పారిపోయి వచ్చినప్పుడు వెలగపూడి ఆస్తులు ఎంత..?... ఇప్పుడు ఎంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే అమర్‌నాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-25T19:38:00+05:30 IST