సుధా గజపతికి కనీస ప్రోటోకాల్ ఇవ్వని అధికారులు..

ABN , First Publish Date - 2020-12-25T13:09:32+05:30 IST

వైకుంఠ ఏకదశిని పురస్కరించుకుని స్వామి దర్శనానికి వచ్చిన ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతికి ఆలయ అధికారులు కనీస మర్యాద ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.

సుధా గజపతికి కనీస ప్రోటోకాల్ ఇవ్వని అధికారులు..

విశాఖపట్నం: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామి దర్శనానికి వచ్చిన ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతికి ఆలయ అధికారులు కనీస మర్యాద ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సాధారణ భక్తురాలిగా వచ్చి సుధా స్వామి దర్శనం చేసుకున్నారు. అయితే ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నప్పటికీ కూడా సుధాకు అధికారులు కనీస ప్రోటోకాల్ ఇవ్వకపోవడం గమనార్హం.


దర్శనం అనంతరం సుధా గజపతి మాట్లాడుతూ...ప్రోటోకాల్ ఇవ్వొద్దని, తమతో ఎవరైనా వస్తే వారిని సస్పెండ్ చేస్తామని కూడా సంచయిత గజపతి ఆదేశించినట్లు తెలిసిందన్నారు. ప్రతి ఏడాది కుటుంబం అంతా కలిసి  దర్శనం చేసుకుంటామని చెప్పారు. అధికారుల నుండి తమకు ఎలాంటి ఆహ్వానం కూడా రాలేదన్నారు. గతంలో అందరినీ కలుపుకొని వెళ్ళేవాళ్ళమని సుధా గజపతి చెప్పుకొచ్చారు.  కాగా.. గత కొన్ని రోజులుగా సుధా ఫ్యామిలీ వర్సెస్ సంచయిత ఫ్యామిలీగా పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.

Updated Date - 2020-12-25T13:09:32+05:30 IST