విశాఖ: కత్తి, డమ్మీ పిస్టల్‌తో రియల్టర్‌కు బెదిరింపులు

ABN , First Publish Date - 2020-12-11T16:47:27+05:30 IST

రియల్టర్ పీఎస్ రాజును కత్తి, డమ్మీ పిస్టల్‌తో బెదిరించిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది.

విశాఖ: కత్తి, డమ్మీ పిస్టల్‌తో రియల్టర్‌కు బెదిరింపులు

విశాఖపట్నం: రియల్టర్ పీఎస్ రాజును కత్తి, డమ్మీ పిస్టల్‌తో బెదిరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.  రౌడీషీటర్లు సంతోష్, లోవరాజు కలిసి రియల్టర్‌ను గదిలో బంధించి రూ.9.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రియల్టర్ పీఎస్ రాజు కారణంగానే అరెస్ట్ అయ్యానంటూ సంతోష్  కక్షపెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజు హతమార్చడానికి లోవరాజుకు సంతోష్  సుపారీ ఇచ్చాడు. కాగా చాకచక్యంగా రౌడీషీటర్ నుంచి తప్పించుకొన్న రియల్టర్ పీఎస్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి , డమ్మీ పిస్టల్, రూ.61 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-11T16:47:27+05:30 IST