విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2020-12-03T14:25:05+05:30 IST

విశాఖలో ప్రేమోన్మాది శ్రీకాంత్... ప్రియాంక అనే యువతి గొంతు కోసిన ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై కొనసాగుతున్న విచారణ

విశాఖపట్నం: విశాఖలో ప్రేమోన్మాది శ్రీకాంత్... ప్రియాంక  అనే యువతి గొంతు కోసిన ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రియాంక, శ్రీకాంత్‌ల  ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పోలీసులు... ఇద్దరి వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాంత్ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. మరోవైపు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రియాంక గొంతులో శ్వాస నాళానికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. 48 గంటల వరకు వైద్యుల పర్యవేక్షణ ఉంచనున్నారు. అటు శ్రీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-03T14:25:05+05:30 IST