విశాఖలో దారుణం.. డబ్బులు తిరిగివ్వలేదని..

ABN , First Publish Date - 2020-10-27T15:44:41+05:30 IST

విశాఖపట్నం : నగరంలోని ఆర్టీసీ కూడలి వద్ద దారుణం చోటుచేసుకుంది.

విశాఖలో దారుణం.. డబ్బులు తిరిగివ్వలేదని..

విశాఖపట్నం : నగరంలోని ఆర్టీసీ కూడలి వద్ద దారుణం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అప్పలనాయుడు అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అప్పుగా తీసుకున్న రూ. 4 వేలు డబ్బులు తిరిగివ్వలేదని ఘర్షణ పడ్డారు. ఆ వివాదం కాస్త హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి యాచకుడు అని తెలిసింది. హత్య చేసిన అనంతరం ఆ ఏరియా నుంచి దుండగులు మరో ఏరియాకు పారిపోయారని తెలియవచ్చింది.


స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే హత్య చేసిందెవరు..? ఎందుకింత దారుణానికి పాల్పడాల్సి వచ్చింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూడలి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-10-27T15:44:41+05:30 IST