గ్రామ సచివాలయాల్లోనే అన్ని సేవలు

ABN , First Publish Date - 2020-12-12T04:53:27+05:30 IST

గ్రామ సచివాలయాల్లోనే అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులో వస్తాయని జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌ చెప్పారు. మండలంలోని సింహాద్రిపురం, జన్నవరం గ్రామాల్లో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను శుక్రవారం ప్రారంభించారు.

గ్రామ సచివాలయాల్లోనే అన్ని సేవలు
జన్నవరం సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌



చోడవరం, డిసెంబరు 11: గ్రామ సచివాలయాల్లోనే అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులో వస్తాయని జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌ చెప్పారు. మండలంలోని సింహాద్రిపురం, జన్నవరం గ్రామాల్లో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1340 సచివాలయ భవనాల నిర్మాణం ప్రారంభించగా, చోడవరంలో రెండు భవనాలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. సచివాలయాల్లో నిపుణులైన ఉద్యోగులు ఉన్నారని, అర్హులందరికీ సకాలంలో పథకాలు మంజూరు చేస్తారని చెప్పారు. జన్నవరం, సింహాద్రిపురం గ్రామాల్లో ధోబీఘాట్‌, రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. 


నాటుసారా జోరు తగ్గేలా చూడండి: ఎమ్మెల్యే

గ్రామాల్లో నాటుసారా జోరు ఎక్కువగా ఉందని, దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే ధర్మశ్రీ కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. నాటుసారా జోరు తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్యాంసుందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజా, పీఆర్‌ డీఈ ప్రసాద్‌, వైసీపీ నాయకులు సింహాద్రిపురం రాజు, సాలాపు శ్రీను, మూడెడ్ల శంకరరావు, బైన ఈశ్వరరావు పాల్గొన్నారు. 


లక్ష్మీపురంలో నాడు-నేడు పనుల పరిశీలన

లక్ష్మీపురం హైస్కూల్‌లో నాడు-నేడు పనులను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పరిశీలించారు. కొళాయిలు, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్‌తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు రుచి చూశారు. 

Updated Date - 2020-12-12T04:53:27+05:30 IST