విశాఖ చెస్‌ కోచ్‌లకు అంతర్జాతీయ అర్హత

ABN , First Publish Date - 2020-06-26T09:59:56+05:30 IST

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య నిర్వహించిన ఫిడే ట్రైనింగ్‌ ఆన్‌లైన్‌ సదస్సులో పాల్గొన్న విశాఖ కోచ్‌లు వి.దుర్గాప్రసాద్‌, జె.నాగరాజులు

విశాఖ చెస్‌ కోచ్‌లకు అంతర్జాతీయ అర్హత

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూన్‌ 25: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య నిర్వహించిన ఫిడే ట్రైనింగ్‌ ఆన్‌లైన్‌ సదస్సులో పాల్గొన్న విశాఖ కోచ్‌లు వి.దుర్గాప్రసాద్‌, జె.నాగరాజులు అంతర్జాతీయ కోచ్‌ అర్హత సాధించారు. ఆన్‌లైన్‌ అర్హత సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనగా  28 మంది అంతర్జాతీయ కోచ్‌ అర్హత సాధించారు. వీరిలో విశాఖకు చెందిన వీరిద్దరూ ఉండడం గమనార్హం. దుర్గాప్రసాద్‌, నాగరాజులను జిల్లా చదరంగం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.ఆనందకుమార్‌, పి.సుబ్బారెడ్డితోపాటు ఇతర ప్రతినిధులు అభినందనలు తెలిపారు.  

Updated Date - 2020-06-26T09:59:56+05:30 IST