కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దు: బాబూజీ

ABN , First Publish Date - 2020-03-19T08:21:22+05:30 IST

కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దు: బాబూజీ

కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దు: బాబూజీ

డాబాగార్డెన్స్‌, మార్చి 18 : జిల్లాలో కరోనావైరస్‌ (కోవిడ్‌-19) లక్షణాలు ఉన్నవారెవరూ లేరని, ఎటువంటి అనుమానిత కేసులు నమోదు కాలేదని అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. ఆర్మడ్‌ రిజర్వ్‌ మైదానంలో కరోనా వైరస్‌పై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ నేపథ్యంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా వైరస్‌ బాధితులకు చికిత్సలు తదితర సేవలను ఈ బృందాలు చేపడతాయన్నారు. జిల్లాలో మొత్తం ఐదు బృందాలు జిల్లా సబ్‌ డివిజన్ల పరిధిలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి, జిల్లా ఆర్మడ్‌ రిజర్వ్‌ కేంద్రాల్లో ఈ టీమ్‌లు పనిచేస్తాయని జిల్లా వైద్యఆరోగ్య శాఖ వారితో కలిసి పనిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శాంతికుమార్‌, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వరరావు, రామారావు, మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-19T08:21:22+05:30 IST