-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vinayaka statue broken
-
వినాయక విగ్రహం ధ్వంసం!
ABN , First Publish Date - 2020-11-27T05:43:37+05:30 IST
జిల్లాలోని కశింకోట మండలం తాళ్లపాలెం శివాలయ ప్రాంగణంలో వినాయకుని విగ్రహాన్ని గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

కశింకోట, నవంబరు 26: జిల్లాలోని కశింకోట మండలం తాళ్లపాలెం శివాలయ ప్రాంగణంలో వినాయకుని విగ్రహాన్ని గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ముక్కలుగా చేసి కింద పడేశారు. విషయం తెలుసుకున్న భక్తులు ఆలయం వద్దకు చేరుకుని ఆవేదన చెందారు. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొంతమంది వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి, విచారణ జరపాలని కోరారు.