పల్లెల్లో నిశ్శబ్దం

ABN , First Publish Date - 2020-03-23T09:06:07+05:30 IST

రచ్చబండల వద్ద వేసవికాలం ముచ్చట్లు లేవు. పాల కేం ద్రాల వద్ద రైతుల సందడిలేదు. ఆరుబయట జనాల మాటామంతీ లేదు. ఊర్లోని కిళ్లీ బడ్డీల వద్ద కాలక్షేపం చేసే...

పల్లెల్లో నిశ్శబ్దం

  •  గ్రామీణ ప్రాంతాల్లోనూ జనతా కర్ఫ్యూ విజయవంతం 
  •  గడప దాటని జనం 
  •  పలుచోట్ల పాలు సైతం  పితకని వైనం 
  •  దూడలకు వదిలేసిన రైతులు
  •  పొలాలకు వెళ్లని రైతులు, రైతుకూలీలు 
  •  నిర్మానుష్యంగా రచ్చబండలు, రామమందిరం అరుగులు
  •  టీవీలు, సెల్‌ ఫోన్లతో కాలక్షేపం 


చోడవరం, మార్చి 22 : రచ్చబండల వద్ద వేసవికాలం ముచ్చట్లు లేవు. పాల కేం ద్రాల వద్ద రైతుల సందడిలేదు. ఆరుబయట జనాల మాటామంతీ లేదు. ఊర్లోని కిళ్లీ బడ్డీల వద్ద కాలక్షేపం చేసే యువకులూ కనిపిం చలేదు. నిత్యం రైతులు, కూలీలతో సందడిగా వుండే పంట పొలాల్లో ఒక్క పురుగు కూడా కనిపించలేదు.  పశువులను కల్లాలకే పరిమి తం చేశారు. ఏ వీధిలోకి వెళ్లినా నిశ్శబ్ద వాతా వరణమే! వాహనాల హారన్ల మోతలు, రణగొణధ్వనులు వినిపిం చలేదు. అర్ధరాత్రి పూట ఎంత నిశ్శబ్దంగా వుంటుందో ఆదివారం పట్టపగలు పల్లెల్లో అదే పరిస్థితి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ‘జనతా కర్ఫ్యూ’కు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్పం దించి స్వీయ బంద్‌ పాటిం చారు.  ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు.కరోనా వైరస్‌పై దేశవ్యాప్తంగా ఆదివారం చేపట్టిన ‘జనతా కర్ప్యూ’కు గ్రామీణ ప్రాం తాల్లో సైతం ప్రజానీకం చక్కగా స్పందిం చింది. పట్టణాలు, మండల కేంద్రాల్లో అధికారులు, పోలీసుల పహారాతో జనతా కర్ఫ్యూ అమలుకావడం సహజమే అయినప్పటికీ.... ఒక్క పోలీసుగానీ, అధికారిగానీ లేని గ్రామాల్లో జనతా కర్ఫ్యూ పూర్తిస్థాయిలో విజ యవంతం కావడం విశేషం.


ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం విధించుకోవడానికి ముందుకు రావడం ఆశ్చర్యం కలిగించే విషయంగానే చెప్పాలి. రైతులు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పశువులకు సరిపడా మేతను ముందురోజే సిద్ధం చేసుకున్నారు. ఇళ్లకు దూరంగా పశువుల శాలల ఉన్న రైతులు పాలు పితకకుండా దూడలకు వదిలేశారు. దీంతో పాల కేం ద్రాలకు తక్కువ పాలు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు పొలాలకు వెళ్లకండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి పనుల తోపాటు ఇతర వ్యవసాయ పనులకు కూలీలు వెళ్లలేదు. ఒక రోజు కూలిలేకపోయినా ఫర్వావాలేదు కరోనా బారినపడకూడదన్న ఉద్దేశంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. 


వేసవిలో మధ్యాహ్నంపూట గ్రామాల్లోని రచ్చబండలు, ఆలయాల వద్ద చెట్ల కింద జనం కాలక్షేపం చేస్తుంటారు. మరికొంతమంది టీ దుకాణాలు, కిల్లీ కొట్లవద్ద సరదగా గడుపుతుంటారు. ఆదివారం గ్రామాల్లో ఎక్కడా ఇటువంటి దృశ్యాలు కనిపించలేదు. ఇళ్లల్లో నుంచి పెద్దలేకాదు.. చిన్న పిల్లలను కూడా బయటకు రానివ్వలేదు. నిరంతరా యంగా విద్యుత్‌ సరఫరా వుండడంతో   దాదాపు అన్ని ఇళ్లల్లో చిన్నవాళ్లు, పెద్దవాళ్లు టీవీల ముందు కూర్చుని కాలక్షేపం చేశారు. చిన్నపిల్లలు వీడియో గేమ్స్‌ ఆడుకున్నారు. దీంతో గ్రామాల్లో ఒక్క వీధిలో కడా జనం సంచారం లేదు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు ఏవీ తిరకపోవడంతో పల్లెల్లో పగటిపూటంతా నిశ్శబ్ద వాతావరణం నెల కొంది. సాధారణంగా సెలవు రోజుల్లో విద్యా ర్థులు క్రికెట్‌ ఆడడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ ఆదివారం వారు సైతం బుద్ధిగా ఇళ్లలోని వుండిపోయారు. 

Updated Date - 2020-03-23T09:06:07+05:30 IST