మండుతున్న కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2020-11-04T04:38:34+05:30 IST

కూరగాయలు ధరలు నింగిని తాకడంతో పేద, మధ్యతరగతి ప్రజలు హడలిపోతున్నారు.

మండుతున్న కూరగాయల ధరలు
రాంబిల్లి వారపు సంతతో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారి

ఏ కూర కొనుగోలు చేసినా కిలో రూ.70

హడలిపోతున్న పేదలు

రాంబిల్లి, నవంబరు 3: కూరగాయలు ధరలు నింగిని తాకడంతో పేద, మధ్యతరగతి ప్రజలు హడలిపోతున్నారు. ప్రతి మంగళవారం రాంబిల్లిలో సంత జరుగుతుంది. ఈ సంతకు 30 గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. కూరగాయల ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు సాహసించడం లేదు. సంతలో ఏ కూర కొనుగోలు చేసినా రూ.70కి పైగా ఉండడంతో కొనుగోలుదారులు హడలిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బంది పడుతుండగా కూరగాయల ధరలు పెరగడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు మండిపోతున్నా ప్రభుత్వం వీటి నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు అదుపులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-04T04:38:34+05:30 IST