7న ఉపరాష్ట్రపతి రాక
ABN , First Publish Date - 2020-12-05T05:56:33+05:30 IST
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల ఏడో తేదీన నగరానికి రానున్నారు.

విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల ఏడో తేదీన నగరానికి రానున్నారు. ఆరోజు బీచ్‌రోడ్డులోని సీఎంఎఫ్ఆర్ఐ సంస్థ ఏర్పాటుచేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ నుంచి సాగర్‌నగర్ వెళతారు. ఈ నెల 13వ తేదీన ఆయన ఢిల్లీ తిరిగివెళతారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మిగిలిన వివరాలు అధికారికంగా విడుదల కావలసి ఉంది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉప రాష్ట్రపతి ఈ నెల రెండో తేదీన రావలసి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే.