వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-03-16T06:56:48+05:30 IST
ఉపమాక క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు.
ఉపమాక (నక్కపల్లి), మార్చి 15 : ఉపమాక క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గరుడాద్రిపై ఉన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. కిందనున్న ఆలయంలో ఉభయదేవేరులతో కూడిన కల్యాణ వేంకటేశ్వరుడ్ని కొలుసు కున్నారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగింది. ఈ సందర్భంగా గ్రామంలో జాతర వాతావరణం తలపించింది.