ప్రసన్నగిరిపై ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-11-22T05:20:30+05:30 IST

కార్తీక మాసం మొదటి శనివారం సందర్భంగా భెల్‌ హెచ్‌పీవీపీ ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రసన్నగిరిపై ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో ప్రసన్నగిరి వేంకన్న

అక్కిరెడ్డిపాలెం: కార్తీక మాసం మొదటి శనివారం సందర్భంగా భెల్‌ హెచ్‌పీవీపీ ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు కె.వెంకట జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు వెంకటేశ్వరస్వామికి పూలు, నగలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, మింది, బీహెచ్‌పీవీ పరిసర కాలనీలకు చెందిన భక్తులు దర్శించుకున్నారు.


Read more