భక్తిశ్రద్ధలతో శూలాల మహోత్సవం
ABN , First Publish Date - 2020-12-01T06:35:46+05:30 IST
మండలంలోని నాగులాపల్లి సాంబశివుని ఆలయంలో సోమ వారం రాత్రి శూలాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మునగపాక, నవంబరు 30 : మండలంలోని నాగులాపల్లి సాంబశివుని ఆలయంలో సోమ వారం రాత్రి శూలాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శిం చుకున్నారు. గ్రామానికి చెందిన పలువురు భక్తులు శూలాలు ధరించి, మొక్కులు చెల్లిం చుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు.