నేటి నుంచి పంచరాత్రుల ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-11-14T04:56:49+05:30 IST

పట్టణంలో పంచరాత్రుల ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి పంచరాత్రుల ఉత్సవాలు
తులసీనగర్‌లోని భూలోకమాంబ అమ్మవారు

ఎలమంచిలి, నవంబరు 13 : పట్టణంలో  పంచరాత్రుల ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వా హకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. తులసీనగర్‌లోని భూలోకమాంబ ఆలయంతో పాటు, పాతవీధిలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను తీర్చిదిద్దారు. ఏటా దీపావళి రోజు  నుంచి  నాగుల చవితి వరకు ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తలు విశాఖ డెయిరీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఆడారి తులసీరావు, ఆడారి ఆనంద్‌ కుమార్‌ల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా వీధులు విద్యుద్దీపాలతో ధగధగలాడు తున్నాయి.

Updated Date - 2020-11-14T04:56:49+05:30 IST