రేపటి నుంచి సింహగిరిపై వైదిక కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-06-01T09:18:20+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో మళ్లీ వైదిక ఉత్సవాలు

రేపటి నుంచి సింహగిరిపై వైదిక కార్యక్రమాలు

సింహాచలం, మే 31: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో మళ్లీ వైదిక ఉత్సవాలు మొదలవుతున్నాయి. మంగళవారం నుంచి పలు కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఏటా మాదిరిగా జూన్‌ 2న వైశాఖమాస బహుళపక్ష ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీలక్ష్మీనారాయణుల వార్షిక తిరుకల్యాణ మహోత్సవం జరుగనుంది. 1న జరుగ అంకురారోపణం, ధ్వజారోహణలతో కల్యాణోత్సవానికి శ్రీకారం చుడతారు.


అదే రోజు స్వర్ణ తులసీ దళార్చన ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించిన భక్తుల గోత్రనామాలతో పరోక్షంగా నిర్వహించనున్నారు.  3న పరోక్ష విధానంలో స్వాతి నక్షత్ర హోమం కూడా చేయనున్నారు.  4న నృసింహ జయంతిని సుప్రభాత సేవ అనంతరం ఏకాంత సేవగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. గడచిన నాలుగేళ్లుగా నృసింహ వనంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ కారణంగా ఏకాంత సేవకు పరిమితం చేసినట్లు అధికారులు తెలిపారు. 5న స్వామి వారికి మూడో విడత చందన సమర్పణ చేస్తారు. 

Updated Date - 2020-06-01T09:18:20+05:30 IST