మాతృసంస్థకు అప్పన్న దేవస్థానం ఎస్డీసీ

ABN , First Publish Date - 2020-07-18T10:12:22+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూ పరిరక్షణ విభాగంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శేష శైలజను ..

మాతృసంస్థకు అప్పన్న దేవస్థానం ఎస్డీసీ

సింహాచలం, జూలై 17: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూ పరిరక్షణ విభాగంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శేష శైలజను మాతృసంస్థ (రెవెన్యూ)కు సరెండర్‌ చేస్తూ దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం భూముల్లో అనధికార నిర్మాణాలు జరిగినా ఎస్డీసీ వాటిని నిరోధించలేకపోయారంటూ దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) చంద్రశేఖర్‌ ఆజాద్‌ విచారణ నివేదికలో పేర్కొన్నారు. దీంతో మాతృసంస్థకు సరెండర్‌ చేయాలని ఆదేశాలు రావడంతో ఈవో భ్రమరాంబ ఆమెను రిలీవ్‌ చేశారు.

Updated Date - 2020-07-18T10:12:22+05:30 IST